News April 2, 2024
అనంతపురం జిల్లాలో రూ.86.58 కోట్లు పింఛన్ నిధులు మంజూరు

అనంతపురం జిల్లాలో 2,89,131 మంది లబ్దిదారులకు మొత్తం రూ.86.58 కోట్లు నిధులు పించన్ మంజూరైనట్లు పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో వృద్ధులు 1,45,839 మందికి గాను రూ.43.75 కోట్లు, వితంతువులు 66,868 మందికి రూ.20 కోట్లు, విభిన్న ప్రతిభావంతులు 46,664 మందికి రూ.13.99 కోట్లు, చేనేతలు 6,793 మందికి రూ.2 కోట్లు, ఒంటరి మహిళలు 6,744 మందికి రూ.2 కోట్లు 3వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 13, 2026
ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.
News February 13, 2026
ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. 1-19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. 1-2 ఏళ్ల వారికి సగం మాత్ర, 2-19 ఏళ్ల వారికి 400 మి.గ్రా మాత్ర భోజనం తర్వాత ఇవ్వాలన్నారు. మిస్ అయిన వారికి ఫిబ్రవరి 24న మాప్-అప్ నిర్వహించనున్నారు.
News February 13, 2026
‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.


