News January 29, 2025
అనంతపురం: నూతన ఎక్సైజ్ డిపో ప్రారంభానికి ఏర్పాట్లు

నూతన ఎక్సైజ్ డిపో ప్రారంభ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్‌లోని సోములదొడ్డి వద్దనున్న నూతన ఎక్సైజ్ డిపోను, పాత ఎక్సైజ్ డిపోలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ డిపోలలో కార్యకలాపాలు ఏ విధంగా సాగుతున్నాయో తెలుసుకున్నారు.
Similar News
News February 18, 2025
JNTUతో MOU కుదుర్చుకున్న DBLNS కంపెనీ

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం DBLNS కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడే లైవ్ ప్రాజెక్టులు, వర్క్ షాప్‌లు, తదితర అంశాలపై MOU కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ శంకర్, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, యూనివర్సిటీ డైరెక్టర్ సుజాత, ఈశ్వర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్, CSE విభాగాధిపతి భారతి, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
News February 17, 2025
104ఏళ్ల బండయ్య మాస్టారుకు సన్మానం

కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలానికి చెందిన 104ఏళ్ల బండయ్య మాస్టారుకు స్థానిక పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన బండయ్య 104ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు. అనంతరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో సర్టిఫికేట్ ప్రదానం చేశారు.
News February 17, 2025
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: కలెక్టర్

ఏ ఒక్క అర్జీదారుడు నిర్లక్ష్యానికి గురికాకుండా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్ శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన PHRS కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.