News April 30, 2024

అనంతలో భగభగమంటున్న భానుడు

image

జిల్లా వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. గుంతకల్లులో సోమవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమల, తలుపులలో 44.1, బొమ్మనహాళ్ 43.9, యల్లనూరు, తాడిపత్రి, అనంతపురంలో 43.7, పెద్దవడుగూరు 43.2, కూడేరు, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 43.0, విడపనకల్లు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 

Similar News

News December 6, 2025

ఐక్యమత్యంతో ర్యాంకింగ్‌కు కృషి చేద్దాం: JNTU వీసీ

image

అనంతపురం JNTUలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో శనివారం “Strategic RoadMap For Improving NIRF rankings” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, APSCHE వైస్ ఛైర్మన్ విజయ భాస్కర్ రావు పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో యూనివర్సిటీ ర్యాంకింగ్‌కు కలిసిగట్టుగా కృషి చేయాలని బోధనా సిబ్బందికి సూచించారు.

News December 6, 2025

అనంతపురంలో రెజ్లింగ్ విజేత శ్రీ హర్షకు సన్మానం

image

ఇటీవల రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన శ్రీహర్షను అనంతపురంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. నార్పల మండలానికి చెందిన బాల శ్రీహర్ష బంగారు పతకం సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. గుజరాత్‌లో నిర్వహించే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హర్ష ఎంపికయ్యారని తెలిపారు. అందులో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.