News March 28, 2024

అనంత : ‘ నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వేటు’

image

రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన ఒప్పంద ఉద్యోగులు విజయకుమార్, సూర్యనారాయణరెడ్డి, తిరుపాల్ రెడ్డి, శింగనమల(M) వెస్ట్ నరసాపురానికి చెందిన క్షేత్ర సహాయకుడు అంజన్ రెడ్డి ఉన్నారు. వీరితో కలిపితే ఇప్పటి దాకా 36 మంది వాలంటీర్లు, ఐదుగురు రేషన్ డీలర్లు, 11 మంది ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు.

Similar News

News February 16, 2026

ఉపాధి బిల్లుల నమోదు పూర్తిచేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ ఎక్స్పెండిచర్ బిల్లుల నమోదును నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నమోదు చేయాల్సిన రూ.131 కోట్లలో ఇప్పటివరకు రూ.77.46 కోట్లు మాత్రమే అప్లోడ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన బిల్లులను వెంటనే నమోదు చేసి లక్ష్యాలు సాధించాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు రోజువారీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు.

News February 16, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 147 కాలేజీలుండగా 64 సెంటర్లు, 18 జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌‌లో 48,146 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫస్టియర్‌లో జనరల్ 22,366, ఒకేషనల్ 2,202 మొత్తం 24,568 మంది, సెకండియర్‌ జనరల్ 1,965, ఒకేషనల్ 21,613 కాగా మొత్తం 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.

News February 16, 2026

పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పన్నుల వసూళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. కోట్లాది రూపాయల పన్నులు పెండింగ్‌లో ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీనెల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు.