News April 4, 2024

అనంత: నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి

image

పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివ, రాధా దంపతుల కుమారుడు అఖిల్ అనే ఏడాది బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 10, 2026

పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. గుత్తి మండలం సేవా గడ్‌లో మంగళవారం సేవాలాల్ జయంతి ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ సేవాలాల్, మాతా జగదాంబ లను దర్శించుకుని పూజలు చేశారు.

News February 10, 2026

మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు: వెంకటరామిరెడ్డి

image

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూను అందరూ మహాప్రసాదంగా భావిస్తారని, అలాంటి లడ్డూను సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు వైఖరి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News February 10, 2026

చారిత్రక కట్టడాల క్యాలెండర్‌ ఆవిష్కరణ

image

అనంతపురం జిల్లా చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా 12 చారిత్రాత్మక కట్టడాలతో రూపొందించిన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వ శతాబ్దపు కోనేరు, క్లాక్ టవర్, గుత్తి కోట, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వంటి ముఖ్యమైన కట్టడాలను నేటి తరానికి పరిచయం చేసేలా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. జిల్లా వైభవాన్ని చాటిచెప్పే ఈ ప్రయత్నం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.