News April 27, 2024
అనంత: రైలు కిందపడి వెస్ట్ బెంగాల్ వాసి ఆత్మహత్య
గుంతకల్లు పట్టణ శివారులో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ అనే వ్యక్తి శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 3, 2024
త్వరలో పెనుకొండలో మరిన్ని పరిశ్రమల స్థాపన: మంత్రి సవిత
పెనుకొండ నియోజకవర్గంలో త్వరలో మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పెనుకొండ టీడీపీ కార్యాలయంలో 5 మండలాలకు చెందిన పార్టీ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కార్యకర్తల బాగుకోసం జీవిత బీమాతో కూడిన పార్టీ సభ్యత్వాన్ని చంద్రబాబు ప్రారంభించారన్నారు.
News November 3, 2024
అనంత: రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టుకు చక్రిక ఎంపిక
అనంతపురానికి చెందిన దండు చక్రిక నవంబర్ 21 నుంచి కటక్‌లో నిర్వహించనున్న బీసీసీఐ ఉమెన్ అండర్-15 వన్డే టోర్నీకి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ భీమలింగా రెడ్డి మాట్లాడుతూ.. చక్రిక 2024-25 సీజన్‌కు ఆంధ్ర మహిళల అండర్-15 రాష్ట్ర జట్టుకు ఎంపికైందన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు.
News November 3, 2024
BREAKING: మంత్రి సవిత పర్యటనలో ఉద్రిక్తత
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు సొంత పార్టీ నుంచే నిరసన వ్యక్తమైంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమిపూజ చేయడానికి మంత్రి రొద్దం గ్రామానికి రాగా.. మండలానికి చెందిన MP పార్థసారథికి కనీసం ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని MP వర్గీయులు నిలదీశారు. దీంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కొద్ది సేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.