News May 23, 2024
అనంత: వేరుశనగ కోసం 31,555 మంది రైతులు పేర్లు నమోదు

అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనం కావాల్సిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 27,868 క్వింటాళ్లకు 31,555 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని డీఏవో ఉమామహేశ్వరమ్మ, ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 24, 520 క్వింటాళ్ల వేరుసెనగ విత్తనకాయలు ప్రాసెసింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 6, 2026
నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.
News March 6, 2026
అనంత విద్యార్థులకు ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగాలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. Infosys కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 8మంది ఎంపికయ్యారు. వీరికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ హంచాటే సుదర్శనరావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో మంచి అవకాశాలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
News March 5, 2026
బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.


