News March 30, 2024

అనంత: సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన నేత పితాని బాలకృష్ణ

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వైసీపీలో చేరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుత్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్‌ను నమ్ముకుని తాము తీవ్రంగా నష్టపోయామని పితాని బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

Similar News

News February 7, 2026

పంచాయతీ ఎన్నికలు.. కమిషన్ సన్నద్ధం

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లాలోని 577 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాను మార్చి 9వ తేదీ నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ నెలలో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో, గడువు ముగియగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.

News February 7, 2026

సేవాలాల్ జయంతికి ప్రత్యేక బస్సులు: జేసీ విష్ణుచరణ్

image

శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గుత్తి – గుంతకల్లు మధ్య సేవాగఢ్ వద్ద బస్సుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కేటాయించాలని సూచించారు. జయంతి వేడుకలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.