News February 16, 2025
అనకాపల్లిలో ధర్నాకు సిద్ధమైన అంగన్వాడీలు

అంగన్వాడీ కార్యకర్తలకు ధర్నాకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
HYDలో ‘హైడ్రా’కు సుప్రీం పవర్స్

హైడ్రాకు చట్టబద్ధమైన అధికారాలు కల్పించే ‘హైడ్రా చట్టం-2026’ ఈ బడ్జెట్ సెషన్‌లోనే ఆమోదం పొందనుంది. దీని ప్రకారం చెరువులు, నాలాల ఆక్రమణల విషయంలో హైడ్రా ఇచ్చే నోటీసులే తుది నిర్ణయంగా మారుతాయి. సివిల్ కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు రాకుండా మున్సిపల్ చట్టాల్లో కీలక సవరణలు చేస్తున్నారు. బడ్జెట్‌లో హైడ్రాకు అదనంగా ₹500 కోట్లు కేటాయించి సొంతంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయబోతున్నారు.
News March 13, 2026
పది పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవోలు

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవోలు రంగయ్య, గిరిరాజ్ వెల్లడించారు. వరంగల్ జిల్లాలో మొత్తం 47 పరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 288 పాఠశాలల నుంచి 9,472 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక హనుమకొండలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 317 పాఠశాలల నుంచి మొత్తం 12,079 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
News March 13, 2026
తాగునీటి పథకానికి రూ.602 కోట్లు మంజూరు: మంత్రి

ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు తాగునీటి కోసం రూ.602 కోట్లు మంజూరైనట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిలో నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. దీంతో ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తి పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు వినియోగిస్తామని అన్నారు.


