News March 12, 2025

అనకాపల్లిలో వైసీపీ నేతల ఆందోళన 

image

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ అధిష్ఠాం పిలుపుమేరకు అనకాపల్లిలో బుధవారం యువత పోరు కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్నారు.ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 17, 2026

గద్వాల్: అదృష్టం ఆమెదే.. ఊహించని మున్సిపల్ ఛైర్ పీఠం!

image

వడ్డేపల్లి మండలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. ప్రధాన పార్టీలు ఆశించిన గెలుపు దూరమైతే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10 వార్డుల్లో 8 చోట్ల గెలిచి మెజారిటీ సాధించింది. బీసీ జనరల్ రిజర్వేషన్ కింద ఛైర్మన్ పదవి ఉండటం, 4వ వార్డు నుంచి గెలిచిన సామాన్య మహిళ మంజుల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆమె కేవలం ఏడు వరకే చదివారు. కలలో కూడా అనుకోలేదని పెద్ద బాధ్యత దక్కిందని ఆమె అన్నారు.

News February 17, 2026

ADB: హంగ్ మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల నియామకం

image

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నికలు వాయిదా పడ్డ మూడు మున్సిపాలిటీలకు TPCC అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఇన్‌ఛార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్‌, MLA కే. సత్యనారాయణను, ఖానాపూర్‌కు MLAలు శ్రీనివాస్, భూపతిరెడ్డిని, కాగజ్ నగర్‌కు ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, MLA కే.ప్రేంసాగర్ రావును నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News February 17, 2026

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

image

కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా ప‌లుచ‌గా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* క‌నుబొమ్మ‌లపై రోజూ ఆముదం నూనెను రాయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా క‌ల‌బంద జెల్ ను క‌నుబొమ్మ‌ల‌పై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. * కొబ్బ‌రి నూనెలో రోజ్‌మేరీ నూనెను క‌లిపి క‌నుబొమ్మ‌ల‌పై మ‌ర్ద‌నా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.