News March 13, 2025
అనకాపల్లిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై సమీక్ష

అనకాపల్లి కలెక్టరేట్‌లో గురువారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన నిర్వహించే శుభ్రత కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు గోడపత్రిలు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 16, 2026
అమలాపురం: పోలీసు పీజీఆర్ఎస్‌కు 31 ఫిర్యాదులు

అమలాపురంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో SP రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 31 దరఖాస్తులు అందాయి. ఈ సమస్యలపై SP సంబంధిత అధికారులతో మాట్లాడి, చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
News February 16, 2026
ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో

జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆర్ఐవో రవి వెల్లడించారు. మొత్తం 28,550 మంది విద్యార్థులు (ప్రథమ సంవత్సరం 14,607, ద్వితీయ సంవత్సరం 13,943) 50 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 700 మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు.
News February 16, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in


