News February 11, 2025

అనకాపల్లి: ‘అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ కార్డులు’

image

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు అనకాపల్లి జిల్లా కార్మిక శాఖ అధికారి వసంతరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు. ఈ పథకంలో చేరిన కార్మికుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.2 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు.

Similar News

News February 19, 2026

మండలిలో మాటల యుద్ధం

image

AP: శాసనమండలిలో కూటమి, YCP సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తిరుమల లడ్డూ అంశం, ఇందాపూర్ డెయిరీ TTDకి నెయ్యి సరఫరాపై చర్చకు YCP వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘హెరిటేజ్‌పై YCP తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆధారాలు తీసుకురమ్మంటే స్పందన లేదు’ అని మండిపడ్డారు.

News February 19, 2026

భారత్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం: బంగ్లా మంత్రి

image

T20 WC నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న <<19153853>>సమస్యను<<>> చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమినుల్ హక్ తెలిపారు. ‘నేను ఇండియా డిప్యూటీ కమిషనర్‌‌తో T20 WC ఇష్యూపై మాట్లాడా. మేం పొరుగు దేశాలతో క్రీడలతో సహా అన్ని రంగాల్లో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్నాం. దౌత్యపరమైన సమస్యలపై ముందే చర్చించి ఉంటే మా జట్టు WCలో ఆడి ఉండేది’ అని హక్ పేర్కొన్నారు.

News February 19, 2026

మెదక్: విషాదం.. యువకుడి Suicide

image

చిలిపిచేడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామంలో మన్నే సుధాకర్ (20) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మంగళవారం గడ్డిమందు తాగగా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు.