News November 5, 2025
అనకాపల్లి: ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పుణ్య దినం కార్తీక పౌర్ణమి. బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అనకాపల్లి జిల్లాలోని అనేక ప్రాంతాలలో ఉన్న శివాలయాలు సందడిగా కనిపించాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు వెళ్లి శివయ్యను దర్శించుకుంటున్నారు. కాశీబుగ్గ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివ పంచాక్షరి నామంతో ఆలయాలు
మార్మోగుతున్నాయి.
Similar News
News January 22, 2026
జగిత్యాల: ‘ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లించాలి’

రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలల్లో తీసుకున్న క్రాప్ లోన్లకు ప్రతి 6నెలలకోసారి 7% వడ్డీ చెల్లించి 3% వడ్డీ తిరిగి పొందాలని పెగడపల్లి, నందగిరి, నంచర్ల సహకార సంఘాల సీఈవోలు గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ కోరారు. 6నెలలకోసారి వడ్డీ చెల్లించిన రైతుకు 3%వడ్డీ తిరిగి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని అన్నారు. లేదంటే 13.75% అపరాధ వడ్డీ పడుతుందని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 22, 2026
గణతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి: జేసీ

మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో 77వ భారత గణతంత్ర దినోత్సవం ముందస్తు ఏర్పాట్లపై డీఆర్ఓ మధుసూదన్ రావు, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతా యుతంగా కృషి చేయాలన్నారు. వేడుకలపై అధికారులకు వివిధ పనులు అప్పగించారు.
News January 22, 2026
ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.


