News February 17, 2025

అనకాపల్లి: ‘ఆవు పాల ధర పెంచాలి’

image

విశాఖ డెయిరీలో జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ పాల రైతు సంఘం డిమాండ్ చేసింది. అనకాపల్లిలోని దొడ్డి రామనాయుడు భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం జరిగింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రపు సూర్య నారాయణ మాట్లాడుతూ.. గత నవంబర్‌లో తగ్గించిన ఆవు పాలు ధర పెంచాలని కోరారు. ఆవు పాలు కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 6, 2026

పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

image

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2026

శాసనమండలిలో వైయస్‌ఆర్‌సీపీ మరో వాయిదా తీర్మానం

image

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు

News March 6, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.