News March 24, 2025

అనకాపల్లి: ఇంటర్ కాలేజీలకు హెచ్చరిక 

image

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారిణి బి. సుజాత హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల ప్రకటన జారీచేసిన తర్వాతే షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్లు చేపట్టాలన్నారు. ఎలాంటి ముందస్తు అడ్మిషన్లు చేపట్టరాదన్నారు.

Similar News

News April 18, 2025

సారంగాపూర్: యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

సారంగాపూర్ మండలం ధని శివారులో బైక్ ఢీకొట్టడంతో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ధని, జామ్ గ్రామాల మధ్య మతిస్థిమితం లేని వ్యక్తి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న నిశాంత్, గణేశ్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే 8712659516ను సంప్రదించాలని సూచించారు.

News April 18, 2025

నాకు గుడి కట్టండి: ఊర్వశి

image

స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన ఊర్వశీ రౌతేలా దక్షిణాదిన తనకు గుడి కట్టాలని కోరారు. బద్రీనాథ్ దగ్గర్లో ఊర్వశీ ఆలయం ఉందని.. అక్కడ అందరూ తన ఆశీర్వాదం తీసుకుంటారని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులైతే తన ఫొటోకు మాలలు వేసి భక్తిగా కొలుస్తారన్నారు. పనిలో పనిగా దక్షిణాదినా ఒక గుడి కడితే బాగుంటుందని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు చూశాక ఊర్వశిని త్వరగా డాక్టర్లకు చూపించాలని నెటిజన్స్ ఫైరవుతున్నారు.

News April 18, 2025

అంబేడ్కర్ కోనసీమ: ఇక కరెంటు కట్ ఉండదు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఇక కరెంటు సరఫరాలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు శుక్రవారం తెలిపారు. 132 కేవీ లైన్‌లో ఛార్జ్ అయ్యాయన్నారు. సాధారణ స్థితి పునరుద్ధరించబడిందని చెప్పారు. ఉదయం 7.10 గంటలకు సరఫరా పునరుద్ధరించటం జరిగిందన్నారు. రెండు రోజుల నుంచి పడిన కరెంటు కష్టాలకు ఇక ఫుల్ స్టాప్ పడిందన్నారు. ఇక వినియోగదారులు నిశ్చింతగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!