News March 4, 2025

అనకాపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 540 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 540 మంది విద్యార్థులు రాయలేదని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగంలో మొత్తం 14,249  మంది విద్యార్థులకు గాను 13,709 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 15, 2025

వికారాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో 7 మండలాల్లో 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 87.77% పోలింగ్ నమోదు కాగా, వికారాబాద్ మండలంలో అత్యధికంగా 87.77శాతం, అత్యల్పంగా బంట్వారం మండలంలో 80.25శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో 2,09,847 మంది ఓటర్లు ఉండగా 1,73,594 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

News December 15, 2025

చిన వెంకన్న సన్నిధిలో రేపటి నుంచి ధనుర్మాస శోభ

image

ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నెలగంట మోగనుండగా, 17 నుంచి స్వామివారి గ్రామోత్సవాలు మొదలవుతాయి. ఈ మాసమంతా ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవను నిర్వహిస్తామని ఈవో ఎన్వీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు.

News December 15, 2025

బిట్రగుంట: రైలు ఢీకొని తెగిపడిన యువకుడి తల

image

బిట్రగుంట రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని యువకుడిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. 20 – 25 ఏళ్ల వయస్సుగల యవకుడు రైలు వచ్చేసమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈఘటనలో యువకుడి తల తెగిపడింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు కావలి రైల్వే పోలీసులను సంప్రదించగలరు.