News September 13, 2025
అనకాపల్లి: ఈనెల 16న జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక

అనకాపల్లి మండలం తుంపాలలో ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు బాల బాలికలకు జిల్లాస్థాయి కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేవారు 2006 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలన్నారు. బాలురు 75 కిలోలు, బాలికలు 65 కిలోల లోపు ఉండాలన్నారు. ఎంపికైన వారు ఈనెల 22 నుంచి విజయవాడలో జరిగే అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు.
Similar News
News December 6, 2025
ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.
News December 6, 2025
కాలాలకు అతీతం ఈ మహానటి

తెలుగువారికి మహానటి అనగానే గుర్తొచ్చే పేరు సావిత్రి. చక్కటి అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. తెలుగు, తమిళ భాషల్లో 84 చిత్రాల్లో నటించిన ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. నటనతో, మానవత్వంతో ఎందరికో స్పూర్తినింపిన ఆమె నటిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. నేడు మహానటి సావిత్రి జయంతి.
News December 6, 2025
డికాక్ సెంచరీ.. 2 వికెట్లు తీసిన ప్రసిద్ధ్

టీమ్ ఇండియాతో జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ సెంచరీ చేశారు. 80 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. వన్డేల్లో డికాక్‌కు ఇది 23వ సెంచరీ. మరోవైపు తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులిచ్చిన భారత బౌలర్ ప్రసిద్ధ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచులో గెలిచిన జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోనుంది.


