News February 18, 2025

అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదే

image

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తం బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకుని పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిని నిర్దేశించిన రిసెప్షన్ సెంటర్లలో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని అన్నారు.

Similar News

News April 18, 2026

విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

image

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

News April 18, 2026

పేరూరు చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

image

చంద్రగిరి నియోజకవర్గంలో నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “జలధార – జలహారతి” కార్యక్రమంలో భాగంగా పేరూరు చెరువును కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు బైకుపై చెరువు పరిసర ప్రాంతాలు పతిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News April 18, 2026

KNR: వాహనదారులకు ‘రిజిస్ట్రేషన్‌’ కష్టాలు..!

image

వాహన్ పోర్టల్ అమలుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభమైందని చెప్పినా, RCలు సకాలంలో అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయి 2 నెలలు గడిచినా RCలు అందకపోవడం గమనార్హం. TR గడువు ముగిసినా RC లేక వాహనదారులు రోడ్లపైకి వెళ్లలేకపోతున్నారు. RTO కార్యాలయాల్లో అడిగితే సాంకేతిక కారణాలంటూ పంపిస్తున్నారని బాధితులు చెబుతుండగా ఈ సమస్య కరీంనగర్, పెద్దపల్లి, HZBలలో ఎక్కువగా ఉంది.