News February 19, 2025

అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదే

image

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకుని పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిని నిర్దేశించిన రిసెప్షన్ సెంటర్లలో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని అన్నారు.

Similar News

News April 16, 2026

ముంబై స్కోర్ ఎంతంటే?

image

IPL: పంజాబ్‌తో మ్యాచులో ముంబై 20 ఓవర్లలో 195/6 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ సెంచరీతో అదుర్స్ అనిపించారు. 60 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 112* రన్స్ చేశారు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50) రాణించారు. రికెల్టన్ (2), సూర్య (0), పాండ్య (14), రూథర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశారు.

News April 16, 2026

NLG: లక్ష్యం దిశగా రబీ కొనుగోళ్లు..

image

NLG జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 5,512 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటివరకు జరిగిన మొత్తం కొనుగోళ్లు 36,360 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. సేకరించిన ధాన్యంలో 36,298 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 62 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉంది. ఈ కొనుగోళ్ల ద్వారా ఇప్పటివరకు 4,112 మంది రైతులు లబ్ధి పొందారు.

News April 16, 2026

NLG: పాడి గేదెల పథకానికి లాస్ట్ డేట్ ఇదే

image

నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా అమలు చేస్తున్న 2 పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 70 శాతం సబ్సిడీతో కూడిన ఈ పథకానికి అర్హులైన ఎస్సీ అభ్యర్థులు OBMMS వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.