News August 19, 2025
అనకాపల్లి: గంజాయి నిందితుడి ఆస్తులు జప్తు

గంజాయి కేసులో నిందితుడైన రోలుగుంట మండలం గొల్లపేటకు చెందిన వి.గోవిందు ఆస్తులు జప్తుకు చెన్నై కాంపిటేటివ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా మంగళవారం తెలిపారు. ఎన్.డీ.పీ.ఎస్ చట్టంలో నిబంధనల మేరకు గంజాయి అక్రమ సాగు, రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయవచ్చునని పేర్కొన్నారు. నిందితుడికి వివిధ ప్రాంతాల్లో రూ.40 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News January 19, 2026
గణతంత్ర వేడుకలకు సిద్దం కావాలి: కలెక్టర్

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకల పై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.
News January 19, 2026
గద్వాల్: సింగోటం జాతరకి వెళ్లి వస్తుండగా ప్రమాదం

కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామానికి చెందిన 20 మంది భక్తులు సింగోటం జాతరలో నరసింహస్వామి వారిని దర్శించుకుని ట్రాక్టర్‌లో తిరిగి ఎర్రవల్లి మండలం వేముల స్టేజి దగ్గర సోమవారం తెల్లవారుజామున వెనుక నుంచి నుంచి డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఖాజా గౌడ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News January 19, 2026
పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?


