News March 7, 2025

అనకాపల్లి: గీత కులాలకు మద్యం షాపుల కేటాయింపు

image

గీత కులాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 15 మద్యం షాపులకు లాటరీ ద్వారా గురువారం కేటాయించినట్లు అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సుధీర్ తెలిపారు. లాటరీ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ రావు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. 15 మద్యం దుకాణాలకు 205 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమానికి పారదర్శకంగా నిర్వహించమన్నారు.

Similar News

News April 16, 2026

WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

image

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

News April 16, 2026

ORR అలైన్‌మెంట్‌పై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

AP: అమరావతి ORR నిర్మాణానికి సంబంధించి విజయవాడ ఆగ్నేయ, ఈశాన్య పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన PILపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ORR నిర్మాణం ఎక్కడ జరగాలో పిటిషనర్ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. నిపుణుల బృందం ఖరారు చేసిన అలైన్‌మెంట్లలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.