News August 23, 2025
అనకాపల్లి: చీపురు పట్టి శుభ్రం చేసిన ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి వ్యర్ధాలను తొలగించారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రతతో అంటూ వ్యాధులు రాకుండా నివారించవచ్చునన్నారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
పాలమూరు జిల్లా మునిసిపల్ రిజర్వేషన్లు ఇలా..!

పాలమూరు కార్పొరేషన్ మేయర్ బీసీ మహిళకు కేటాయించగా..భూత్పూర్ ఎస్టీ జనరల్, జడ్చర్ల జనరల్, దేవరకద్ర బీసీ మహిళ, గద్వాల జనరల్ మహిళ, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి బీసీ జనరల్, నాగర్‌కర్నూల్ బీసీ జనరల్, కొల్లాపూర్, అచ్చంపేట బీసీ మహిళలకు, కల్వకుర్తి జనరల్ మహిళ, నారాయణపేట, కోస్గి జనరల్ మహిళ, మక్తల్ జనరల్, మద్దూరు బీసీ జనరల్, వనపర్తి జనరల్ మహిళ, కొత్తకోట,ఆత్మకూరు బీసీ మహిళలకు, అమరచింత బీసీ జనరల్‌కు దక్కాయి.
News January 17, 2026
కోమా నుంచి కోలుకున్నా.. మార్టిన్ ఎమోషనల్ పోస్ట్

కోమా నుంచి కోలుకున్న AUS మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘DEC 27న నా జీవితం తలకిందులైంది. ఒక్క క్షణంలో లైఫ్ ఎలా మారిపోతుందో తెలిసింది. 8 రోజులు <<18765261>>కోమాలో<<>> ఉన్నా. బతికేందుకు 50-50 ఛాన్స్ ఉండగా కోమా నుంచి బయటపడ్డా. కానీ నడవలేకపోయా. ఇప్పుడు కోలుకున్నా. బీచ్‌లో నిల్చోగలిగా. సపోర్ట్ చేసిన వారికి థాంక్యూ’ అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు.
News January 17, 2026
వీరు చంద్రుడిని పూజిస్తే సమస్యలన్నీ దూరం

మనస్సుకు కారకుడు చంద్రుడు. మానసిక ప్రశాంతత లేనివారు, అనవసర భయాలతో ఆందోళన చెందేవారు చంద్రుడిని ఆరాధించాలి. చర్మ సంబంధిత వ్యాధులు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ పూజ మేలు చేస్తుంది. చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పౌర్ణమి రోజున ధ్యానం చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా, శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం చంద్రుడిని ప్రార్థించడం ఎంతో అవసరం.


