News July 5, 2024
అనకాపల్లి: చెరువు ఊబిలో కూరుకుపోయి కూలీ మృతి

వ్యవసాయ కూలీ స్నానం కోసం చెరువులో దిగి ఊబిలో కూరుకుపోయి శుక్రవారం మృతి చెందారు. నక్కపల్లి మండలం ఎన్.నరసాపురానికి చెందిన బాల సత్తిబాబు(56) ఉపమాక గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లారు. పని ముగించుకుని వచ్చే సమయంలో పక్కనే ఉన్న చెరువులో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఊబిలో కూరుకుపోయారు. గమనించిన తోటి కూలీలు బయటికి తీసి చూసేసరికి అప్పటికే మృతిచెందారు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 17, 2025
విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.
News December 17, 2025
విశాఖలో 102 మంది ఎస్‌ల బదిలీ

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్‌కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.
News December 17, 2025
బతికున్నప్పుడే అన్నీ జరగాలి: అశోక్ గజపతి రాజు

ఎడ్యుసిటీ ఒప్పంద కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు భావోద్వేగమయ్యారు. ‘మనం ఎప్పుడు చనిపోతామో చెప్పలేము.. బతికున్నప్పుడే సాధించాలి. నేను ఉన్నప్పుడే ఈ మంచి కార్యాలు జరగాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి. నా తరువాత నా వారసులు ఆ పని కచ్చితంగా చేస్తారనే నమ్మకం నాకు ఉంది. మరిన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అందుకు మీ ఆశీస్సులు ఉండాలంటూ’ ఆయన మాట్లాడారు.


