News September 11, 2025
అనకాపల్లి జిల్లాకు 19 డ్రోన్లు: ఎస్పీ

డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాల నియంత్రించవచ్చునని ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యంగా గంజాయి రవాణాను అరికట్టడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 19 డ్రోన్లు కేటాయించినట్లు తెలిపారు.వీటి నిర్వహణకు పోలీస్ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా నిఘాను పెంచుతున్నాం న్నారు.
Similar News
News December 7, 2025
సిరిసిల్ల: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్

సిద్దిపేట(D)లో అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్ చేసుకుంది. దుబ్బాక మం. తిమ్మాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌కు సిరిసిల్ల (D)
ఇల్లంతకుంట (M) పెద్దలింగాపూర్ వాసి సుష్మ(32)తో 12ఏళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలంగా భర్త, అత్త, మామల వేధింపులపై సుష్మ తరచూ తల్లిదండ్రుల వద్ద వాపోయేది. ఈ క్రమంలో సుష్మ శనివారం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, అత్త ఎల్లవ్వ, మామ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
కృష్ణా తరంగ్ ఛాంపియన్‌గా నిలిచిన పీబీ సిద్ధార్థ

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ 2025 ఓవరాల్ ఛాంపియన్‌గా విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ నిలవగా రన్నరప్‌గా విజయవాడ నలందా కాలేజ్ నిలిచింది. గత మూడు రోజులుగా విశ్వవిద్యాలయంలో నాలుగు విభాగాలకు సంబంధించి 28 కేటగిరీలలో పోటీలు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.
News December 7, 2025
అక్కడ ఫ్లైట్లు ఎగరవు.. ఎందుకో తెలుసా?

టిబెట్ పీఠభూమిలో ఎత్తైన పర్వతాలు ఉండటంతో ఫ్లైట్లు నడపడం చాలా కష్టం. 2.5 మిలియన్ల చదరపు కి.మీ విస్తరించి ఉన్న ఆ పీఠభూమిలో సగటున 4,500 మీటర్ల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండటంతో ఇంజిన్ పనితీరు తగ్గిపోతుంది. ఎమర్జెన్సీలో ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి అక్కడ ఇతర విమానాశ్రయాలు ఉండవు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. వర్షాలు, భారీ ఈదురుగాలులు వీస్తాయి.


