News May 7, 2025

అనకాపల్లి జిల్లాకు 5,30,355 పాఠ్యపుస్తకాలకు ఇండెంట్

image

అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు 5,30,355 పాఠ్య పుస్తకాలకు ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టినట్లు డీఈఓ అప్పారావునాయుడు శుక్రవారం తెలిపారు. ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా పాఠ్య పుస్తకాలను అనకాపల్లి జిల్లాకు ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠ్యపుస్తకాలు గాజువాక గిడ్డంగికి చేరుకున్నాయన్నారు. ఈ ఏడాది ఏడవ తరగతి పాఠ్యపుస్తకాలు మారుతున్న కారణంగా అవి ఆలస్యంగా వస్తాయని అన్నారు.

Similar News

News February 16, 2026

శ్రీకాళహస్తిలో భక్తురాలు మృతి: YCP

image

AP: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తురాలు మృతిచెందినట్లు YCP ఆరోపించింది. శివరాత్రి రోజున శివయ్య దర్శనానికి వచ్చిన తిరుపతి(D) కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి అస్వస్థతకు గురైనట్లు చెప్పింది. సమాచారం ఇచ్చినా సకాలంలో 108 వెహికల్ రాలేదని, దీంతో ఆమె మృతిచెందినట్లు ట్వీట్ చేసింది. పండగ రోజు ఆలయాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని, ఈ పాపం ప్రభుత్వానిదే అని మండిపడింది.

News February 16, 2026

భీమేశ్వరాలయంలో లింగోద్భవ పూజలో పాల్గొన్న మంత్రి

image

వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో లింగోద్భవ సమయంలో నిర్వహించిన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి 11.35 గంటలకు శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించి శ్రీ స్వామి వారి ప్రసాదం అందజేశారు.

News February 16, 2026

ఖమ్మం: రేణుకా చౌదరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

image

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన కమిటీ నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబరులో పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తన పెంపుడు కుక్కను వెంట తెచ్చుకోవడంతో పాటు, సహచర సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ, ఈ నెల 23 లోపు సమాధానం సమర్పించాలని నోటీసులో స్పష్టం చేసింది.