News August 21, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤జిల్లావ్యాప్తంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని నిరసన
➤శారదా నదిలో మహిళ మృతదేహం లభ్యం
➤గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష
➤ 60 కేజీల గంజాయితో 8 మంది అరెస్ట్
➤రోడ్డుపై మొక్కలు నాటి నిరసన తెలియజేసిన గిరిజనులు
➤గునపాం గుచ్చుకొని కూలీ మృతి
➤పలు గ్రామాల్లో ఘనంగా మరిడమ్మ తల్లి పండగ
➤పరిశ్రమల వ్యర్థాలతో మత్స్య సంపద నాశనం

Similar News

News January 15, 2026

NTVపై చర్యలకు కారణం ఇదేనా?

image

TG: మంత్రి, ఓ మహిళా IAS అధికారికి సంబంధం ఉందని <<18856335>>NTV<<>>, పలు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తతో సివిల్ సర్వీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నేరుగా పేరు ప్రస్తావించకపోయినా హోదాలు చెప్పి పరోక్షంగా ఆమె పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేసింది. ఆ వార్తను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేయడంతో సర్కారు.. సిట్ ఏర్పాటు చేసి యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు ఇచ్చింది. NTV రిపోర్టర్లను అరెస్టు చేసింది.

News January 15, 2026

పీహెచ్‌సీలల్లో మందుల కొరత ఉండొద్దు: మెదక్ కలెక్టర్

image

పీహెచ్‌సీలల్లో అన్ని రకాల మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గది, రికార్డులు, హాజరు పట్టికని పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని, అన్ని పరీక్షలు, మందులు నాణ్యతతో ఉచితంగా అందించాలని సూచించారు.

News January 15, 2026

సూర్య మూవీకి రూ.85 కోట్ల OTT డీల్!

image

హీరో సూర్య, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.85 కోట్లకు OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యధికమని సమాచారం. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య లాస్ట్ మూవీ ‘రెట్రో’ పెద్దగా ఆకట్టుకోకపోయిన మార్కెట్‌లో డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.