News March 27, 2025

అనకాపల్లి జిల్లాలో నేడు తీవ్ర వడగాడ్పులు.. వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో గురువారం రెండు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. ఇదిలావుండగా బుధవారం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల 39 డిగ్రీల పైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్‌ సూచించారు.

Similar News

News April 24, 2025

‘రెట్రో’ కథ ఆ హీరో కోసం అనుకున్నా: కార్తీక్ సుబ్బరాజు

image

‘రెట్రో’ సినిమా కథను దళపతి విజయ్ కోసం రాశారన్న ప్రచారంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్పందించారు. రజినీకాంత్ కోసం ఈ స్టోరీ రాసుకున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని తెలిపారు. సూర్య రావడంతో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. సినిమాలో రొమాంటిక్ డ్రామాను జోడించినట్లు పేర్కొన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

News April 24, 2025

అండమాన్‌లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

image

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్‌లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్‌ గెలుపొందారు.

News April 24, 2025

భారత్, పాక్ సైనిక బలాలివే!

image

భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో 2 దేశాల వద్ద ఉన్న సైనిక బలాలేంటో తెలుసుకుందాం.
♦ ఆర్మీ సైనికులు: 14,55,550 (భారత్), 6,54,000 (పాక్)
♦ వైమానిక ట్యాంకర్లు: 6 (భారత్), 4 (పాక్)
♦ అణు జలాంతర్గాములు: 293(భారత్), 121 (పాక్)
భారత్→ 2,299 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 జెట్స్
పాక్→ 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 జెట్స్
▶ అలాగే, భారత్ వద్ద 1.15M రిజర్వ్, 25 లక్షల పారా మిలిటరీ బలగాలున్నాయి.

error: Content is protected !!