News March 16, 2025
అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News February 19, 2026
ములుగు: పోలీసుల అదుపులో దామోదర్?

ములుగు జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ పోలీసుల అదుపులోకి వచ్చారనే సమాచారం చర్చనీయాంశమైంది. గత వారం రోజులుగా మహాముత్తారం, ఏటూరునాగారం అడవుల్లో విస్తృత కూంబింగ్ నిర్వహించిన పోలీసులు.. కీలక విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మూడు నెలలుగా దామోదర్ ములుగు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడనే వినికిడి ఉంది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
News February 19, 2026
VJA: బడుగు జీవులను దోచుకుంటున్నారు..!

విజయవాడ కనకదుర్గ ఆలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించే మ్యాన్‌పవర్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీతం చెప్పేది ఒకటి.. ఇచ్చేది మరోలా ఉందంటున్నారు. PF, ESI చెల్లెస్తున్నారో లేదో కూడా సమాధానం చెప్పట్లేదంటున్నారు. ఆలయంలో సుమారు 480 మంది విధులు నిర్వహిస్తున్నారు. రోజుకి 9-10 గంటలు నుంచుని విధులు నిర్వహిస్తున్న బడుగుజీవులను దోచుకుంటున్నారంటున్నారు
News February 19, 2026
సూర్యాపేట: బడా నేతల వార్డుల్లోనూ BRSకు తప్పని ఓటమి

దశాబ్ద కాలంగా కీలక నామినేటెడ్ పదవులు అనుభవించిన బీఆర్ఎస్ నేతలకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతతో పాటు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ తమ సొంత వార్డుల్లోనూ పార్టీని గెలిపించుకోలేక పోయారు. మున్సిపల్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ల వార్డులైన 9, 36, 38లోనూ పార్టీకి పరాభవం తప్పలేదు. జడ్పీ వైస్ ఛైర్మన్ నివాసం ఉండే 46వ వార్డులోనూ ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.


