News October 8, 2025

అనకాపల్లి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

image

ఈనెల 9న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అనకాపల్లి జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసుల అనుమతితో తమకు పనిలేదని జగన్ రోడ్ షోలు నిర్వహిస్తామని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఒత్తిడితోనే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని వైసీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Similar News

News January 19, 2026

భూపాలపల్లి: సర్పంచ్‌లకు ప్రారంభమైన ఓరియంటేషన్ శిక్షణ

image

జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సర్పంచులకు సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మంది రిసోర్స్ పర్సన్లు సర్పంచులకు విధివిధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐదు మండలాల నుంచి వచ్చిన 100 మంది సర్పంచులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, ఐదు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం, నిధుల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

News January 19, 2026

IREDAలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(<>IREDA<<>>)లో 10 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BCom, BCA, డిప్లొమా(CS/IT) అర్హతగల వారు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ireda.in

News January 19, 2026

అమెనోరియా సమస్యకు కారణమిదే!

image

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.