News September 11, 2025
‘అనకాపల్లి జిల్లాలో 9,429 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ’

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 9,429 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు బుధవారం తెలిపారు. ఇంకా 131.41 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న జిల్లాకు మరో 494 టన్నుల యూరియా రానున్నట్లు చెప్పారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దన్నారు.
Similar News
News December 7, 2025
నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతోందా?

కొంతమందికి నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. అయితే ఇది సాధారణం కాదంటున్నారు వైద్యులు. నిద్రలో నోటి నుంచి లాలాజలం కారడం కొన్ని వ్యాధులకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. సైనస్ ఇన్‌ఫెక్షన్, నిద్ర, నాడీ, గ్యాస్ట్రో సంబంధిత, దంతాలు లేదా చిగుళ్లలో సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 7, 2025
తుఫాను పరిహారం ఏదయ్యా..?

మొంథా తుఫాను ధాటికి జిల్లాలోని 33,262 మంది రైతులకు చెందిన 41,350 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ప్రభావంతో సుమారు రూ. 40.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే తుఫాను సంభవించి నెల రోజులు గడిచినా, ఇంతవరకు పంట నష్టపరిహారం అందకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
యువతిపై లైంగిక వేధింపులు.. పోలీసులు కేసు తీసుకోలేదా..?

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతికి సంబంధించిన వివాదంపై పలు ప్రచారాలు సాగుతున్నాయి. యువతి తరఫున ముగ్గురు గత నెల 24, 25న స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా తీసుకోలేదని సమాచారం. దీంతో యువతి మరోదారి లేక టీసీ తీసుకుని వెళ్లిపోయిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.


