News August 13, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ అనకాపల్లి హైవేపై టూరిస్ట్ బస్సు బోల్తా
➤ మాడుగులలో 13 అడుగుల గిరి నాగు పట్టివేత
➤ దేవరాపల్లి జాబ్ మేళాలో 122 మందికి నియామక పత్రాలు
➤ జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలు
➤ గంజాయి రవాణా కేసులో ముద్దాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష
➤ ఎలమంచిలి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యం: ఎమ్మెల్యే
➤ విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన
Similar News
News March 14, 2026
తిరుపతి: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడి

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు ₹30 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించుకుని పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.
News March 14, 2026
ANU దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సర్వసిద్ధం

ANU దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 15న జరిగే MBA, MCA ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు CDE డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12గంటల లోపు పూర్తి చేసి పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలన్నారు. దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా ఆధార్ కార్డు, అభ్యర్థి ఫోటో తోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాలలో నేరుగా హాజరు కావచ్చన్నారు.


