News October 7, 2025
అనకాపల్లి: జిల్లాస్థాయి అధికారులకు అవార్డులు

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులకు అవార్డులు లభించాయి. జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణ రావు, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఏఎస్పీ మోహనరావుకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 23, 2026
చిత్తూరు: రేపే చివరి అవకాశం

దళిత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం అజయ్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చిత్తూరు DRDA పీడీ శ్రీదేవి ఓ ప్రకటనలో కోరారు. అర్హులైన ఎస్సీ మహిళలు శనివారం లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులను మండల మహిళా సమాఖ్యలో సమర్పించాలన్నారు. ఈ పథకంలో జిల్లాకు 205 యూనిట్లు కేటాయించారన్నారు.
News January 23, 2026
చెన్నూర్: 100 పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

చెన్నూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News January 23, 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.


