News November 19, 2025

అనకాపల్లి: ‘టీచర్లు సమస్యలు పరిష్కరించాలని వినతి”

image

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లిలో డీఈవో అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు సెలవు పెడితే వారి స్థానంలో సర్ప్లస్ టీచర్స్‌ను డిప్యూటేషన్‌పై పంపించాలన్నారు. 2024-25లో స్పాట్ వాల్యూషన్ ఉపాధ్యాయులకు డీఏ చెల్లించాలన్నారు.

Similar News

News January 24, 2026

స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు: హరీశ్

image

TG: భట్టి విక్రమార్క ఎన్ని సాకులు <<18943730>>చెప్పినా<<>> బొగ్గు కుంభకోణం, అందులో రేవంత్ బామ్మర్ది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజమని హరీశ్ రావు ఆరోపించారు. లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు ‘భట్టి గారూ మీరంటే నాకు చాలా గౌరవం. దీనిపై సిట్టింగ్ జడ్జి, CBI విచారణ కోసమే కిషన్‌రెడ్డికి లేఖ రాశా. రేవంత్, అతని బామ్మర్దిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాస్తా’ అని తెలిపారు.

News January 24, 2026

జిల్లాలో మాతృమరణాల నివారణే లక్ష్యం: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో మాతృమరణాలను నివారించడమే లక్ష్యం పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మాతృమరణాలకు గల కారణాలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 24, 2026

విశాఖ ఉత్సవ్-2026.. నేడు ఆర్కే బీచ్‌లో గాయని సునీత సందడి

image

భారతదేశపు అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్-2026‌లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్కే బీచ్ వేదికగా ప్రముఖ గాయని సునీతతో ‘మ్యూజికల్ నైట్’ జరగనుంది. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘సీ టు స్కై’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగర తీరంలో సాగే ఈ సంగీత వేడుకను తిలకించేందుకు నగరవాసులు, పర్యాటకులు తరలిరావాలని నిర్వాహకులు కోరారు.