News November 19, 2025
అనకాపల్లి: ‘టీచర్లు సమస్యలు పరిష్కరించాలని వినతి”

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లిలో డీఈవో అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు సెలవు పెడితే వారి స్థానంలో సర్ప్లస్ టీచర్స్‌ను డిప్యూటేషన్‌పై పంపించాలన్నారు. 2024-25లో స్పాట్ వాల్యూషన్ ఉపాధ్యాయులకు డీఏ చెల్లించాలన్నారు.
Similar News
News January 20, 2026
పెద్దపల్లి: ‘రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు’

PDPL జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, స్పీడ్‌బ్రేకర్లు, రోడ్డు స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కేజీ వీల్స్ వాడే వాహనాలకు భారీ జరిమానాలు విధించి, మళ్లీ వాడితే సీజ్ చేయాలన్నారు. పశువులను రోడ్లపై వదిలితే రూ.10వేలు జరిమానా, డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు పెంచాలని ఆదేశించారు.
News January 20, 2026
HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.
News January 20, 2026
మంథని జేఎన్టీయూలో జెఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు సెషన్లలో 80 మంది చొప్పున పరీక్ష రాయనున్నారు. ఏర్పాట్లను PDPL అడిషనల్ కలెక్టర్ వేణు పరిశీలించి ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుమన్, ఏఎస్ఐ మహేష్ పాల్గొన్నారు.


