News March 8, 2025
అనకాపల్లి: టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 31 వరకు ఆయా తేదీల్లో ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు DPTO పద్మావతి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి సొంతూరు నుంచి పరీక్షా కేంద్రానికి, పరీక్ష రాసిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు పల్లె వెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నామన్నారు. బస్సు ఎక్కినప్పుడు హాల్ టికెట్ చూపించాలన్నారు.
Similar News
News January 24, 2026
సంతాన ప్రాప్తి కోసం రేపు ఏం చేయాలంటే..?

సంతాన ప్రాప్తి కోరేవారు రథ సప్తమి రోజు బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. సూర్య నామాలు స్మరిస్తూ దాన్ని 7 రంగులతో నింపాలి. పద్మం మధ్యలో శివపార్వతులను ఉంచి, పక్కనే తెల్లని వస్త్రంపై సూర్యరథపు ప్రతిమను ఉంచి ఎర్రని పూలతో పూజించాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. దాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఏడాది పాటు ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ, సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఫలితం ఉంటుంది.
News January 24, 2026
జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీల్లో NGKL జిల్లావాసికి ప్రథమ బహుమతి

వనపర్తి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (DLSA) నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీల్లో లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన అతినారపు సాయి సాగర్ మొదటి బహుమతి సాధించాడు. సామాజిక అవగాహన కోసం ఆయన రూపొందించిన చిత్రం న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందింది. బాధ్యతాయుతమైన చిత్రాలను రూపొందించినందుకు సాయి సాగర్‌ను గ్రామస్థులు అభినందించారు.
News January 24, 2026
విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.


