News December 2, 2025
అనకాపల్లి: ‘టెన్త్ విద్యార్థుల శత శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి’

జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయులు అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. అనకాపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాలలో హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ నెల 5న మెగా పీటీఎం సమావేశం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. డీఈఓ అప్పారావు, ఆఐఓ వినోద్ బాబు పాల్గొన్నారు.
Similar News
News February 11, 2026
అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.
News February 11, 2026
సంగారెడ్డి: ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో సెలవు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో నేడు జరగనున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కలెక్టర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి సెలవుదినంగా ప్రకటించినట్లు వివరించారు.
News February 11, 2026
జనగామ జిల్లా యువతికి యూజీసీ నెట్‌లో ఆలిండియా రెండో ర్యాంకు!

రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్ల రేణుక-వాసు దంపతుల కుమార్తె శిరీష యూజీసీ నెట్‌లో 99.901 పర్సంటేజ్ సాధించి ఆలిండియా రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా యువతిని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గ్రామస్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.


