News April 23, 2025

అనకాపల్లి డాక్టర్‌కు సివిల్స్‌లో ర్యాంకు

image

పట్టుదల, కఠోర శ్రమతో అనకాపల్లికి చెందిన డాక్టర్ రావాడ సాయి మోహిని మానస సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఓ పక్క విశాఖలోని చిన వాల్తేరు పీహెచ్సీలో వైద్యాధికారిణిగా పనిచేస్తూ మరోపక్క సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో మూడవ ప్రయత్నంలో మానస 975వ ర్యాంకు సాధించారు. మానస తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలుగా పని చేస్తున్నారు.

Similar News

News March 7, 2026

HYD: మేడం సార్.. మేడం అంతే!

image

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.

News March 7, 2026

రాజకీయాల్లోకి త్రిష?

image

TVK చీఫ్ విజయ్‌‌-త్రిష డేటింగ్ రూమర్స్ మధ్య మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే త్రిష పొలిటికల్ ఎంట్రీ. తనకు CM అవ్వాలని ఉందంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్‌ తెరపైకి వచ్చాయి. త్వరలోనే విజయ్ TVK పార్టీలో చేరనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకోసం సినిమాలకు సైన్ కూడా చేయడంలేదని మరో గాసిప్. ఇక భార్యతో విడాకుల సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ్ వివాహం చేసుకోనున్నారని వార్తలొస్తున్నాయి.

News March 7, 2026

ఖమ్మం: మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ

image

ఖమ్మంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో నిరుపేద మహిళలకు ‘రిటైల్ అండ్ సేల్స్ అసిస్టెంట్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ విజేత తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 18-35 ఏళ్ల లోపు వయస్సు, పదో తరగతి అర్హత ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 నెలల శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.