News May 7, 2025
అనకాపల్లి: నిందితుడిని పట్టించిన బైక్ రిజిస్ట్రేషన్..!

గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్లుగా పరారీలో ఉన్న వంతల సుందర్ రావు(23)ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సుందర్‌ది అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నారు. 36 కిలోల గంజాయి రవాణా చేస్తూ, రెండు బైక్‌లను, గంజాయిని వదిలి పరారయ్యాడని తెలిపారు. తాజాగా బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఒడిశాలో అరెస్టు చేశామన్నారు.
Similar News
News February 18, 2026
పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.
News February 18, 2026
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

గుంటూరు జిల్లాలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. అనంతరం విద్యార్థులకు భోజనం పెడతారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయి. టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. జూన్ 12న బడులు పునఃప్రారంభం అవుతాయి.
News February 18, 2026
పీఎఫ్ జమల్లో ఆలస్యం.. ఉపాధ్యాయుల ఆందోళన

గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల పీఎఫ్ బకాయిల జమ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. 2022లో జీతాల నుంచి కత్తిరించిన మొత్తాలు ఇంకా ఖాతాలకు చేరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నివేదికలలో స్పష్టత లేకపోవడం వల్ల జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బదిలీల కారణంగా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే డీఏ బకాయిలు కూడా పూర్తిగా జమ కాలేదని వారు అంటున్నారు


