News August 11, 2025
అనకాపల్లి పీ.జీ.ఆర్.ఎస్.కు 291 అర్జీలు

అనకాపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 291 అర్జీలను అధికారులకు సమర్పించారు. కలెక్టర్ విజయకృష్ణన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు పంపించి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2026
హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
News March 16, 2026
కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.
News March 16, 2026
పెద్దపులి కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు..?

కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రెండు రోజులుగా పశువులపై పెద్ద పులి దాడి చేయడంతో గంగారాం తండా, దమ్మయ్య పేట సూరంపేట గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట బయటకు రావద్దని వారు ప్రజలకు తెలిపారు.


