News February 7, 2025

అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో పోలీసులకు ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం జిల్లా కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ ఎస్పీ ముందు హాజరై వారి వ్యక్తిగత అనారోగ్య సమస్యలను తెలిపారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Similar News

News February 13, 2026

​మూడు కార్పొరేషన్లు.. కో-ఆప్షన్ కొలువులో కొత్త లెక్క!

image

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ఇప్పుడు హాట్ టాపిక్. గతంలో ఐదుగురు సభ్యులకే పరిమితమైన ఈ కోటా ఇప్పుడు ఆరుగురికి పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. తమకు అవకాశం దక్కుతుందా అని ఆశావాహులు ఆరా తీస్తుండగా, పాత లెక్కలు మారి కొత్త వారి ఎంట్రీకి మార్గం సుగమమైంది. పెరిగిన సభ్యుల బలంతో పాలనలో వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు.

News February 13, 2026

కొల్లాపూర్: పట్టు నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి

image

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి పట్టు నిలబెట్టుకున్నారు. మొత్తం 19 వార్డులకు గాను 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు.

News February 13, 2026

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పనులు వేగవంతం

image

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు 24 గంటలూ పనులు చేస్తున్నారు. సుందరీకరణ పనులకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి విగ్రహావిష్కరణ మాత్రమే మార్చి 16న జరుగుతుందని సమాచారం. మిగిలిన పనులు తర్వాత పూర్తి కానున్నాయి.