News March 6, 2025
అనకాపల్లి: ‘ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలి’

రెవెన్యూ అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో MROలు, డీటీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు కల్పిస్తున్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేయాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. జేసీ జాహ్నవి, వీఆర్వో సత్యనారాయణరావు పాల్గొన్నారు.
Similar News
News December 14, 2025
బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో 56.44% పోలింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది. .
News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @11AM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.7% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 56.4%, కొత్తకోట 60.4%, మదనాపూర్ 60.9%, ఆత్మకూరు 57.8%, అమరచింత 67.0% పోలింగ్ నమోదైంది.


