News March 9, 2025
అనకాపల్లి: యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీ నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News January 20, 2026
సిరిసిల్ల: ‘వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయి’

బీజేపీలో పదవులు వారసత్వంగా కాదు.. అంకితభావంతో లభిస్తాయని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున బీజేపీ కార్యాలయంపై మంగళవారం జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. సేవ చేసే వారికి మాత్రమే పట్టం కట్టే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. శంకర్, తిరుపతి, రాజు, హరీష తదితరులు పాల్గొన్నారు.
News January 20, 2026
విజయనగరం కలెక్టర్‌కు అవార్డు

విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి, పూర్వ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీరి పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
News January 20, 2026
‘అబూ సలేం పారిపోతాడు’.. పెరోల్‌పై ప్రభుత్వం అభ్యంతరం

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం పెరోల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సోదరుడి మరణం నేపథ్యంలో పెరోల్ కోసం అప్లై చేయగా, 14 రోజులు ఇస్తే అబూ సలేం పారిపోయే ప్రమాదం ఉందని MH ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అత్యవసరమైతే 2 రోజులు మాత్రమే పెరోల్ ఇవ్వొచ్చని సూచించింది. కాగా గతంలో సలేం పోర్చుగల్‌కు పారిపోగా అక్కడి నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.


