News September 11, 2025

అనకాపల్లి: ‘రేపు దిశా కమిటీ సమావేశం’

image

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఈనెల 12న డెవలప్‌మెంట్ కో-ఆర్డినేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించనున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశానికి ఎంపీ సీఎం రమేశ్ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అవి జిల్లాలో అమలు జరుగుతున్న తీరు, వాటి ప్రభావంపై సమీక్షిస్తారని తెలిపారు.

Similar News

News December 7, 2025

చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. సోమవారం రాత్రి 9.45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మ.2 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు, బుధవారం సా.4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం 6.30కు చర్లపల్లికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

News December 7, 2025

మంచిర్యాల-పెద్దంపేట మధ్య రైలు కింద పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. మృతుని వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉండగా.. టీ షర్ట్, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ తరలించి జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు సమీపంలోని స్టేషన్లు సంప్రదించాలని సూచించారు.

News December 7, 2025

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే

image

చిన్నస్వామి స్టేడియం నుంచి IPL మ్యాచ్‌లను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ‘ఇది కర్ణాటక, బెంగళూరు గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా చూస్తాం. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది విజయోత్సవ ర్యాలీలో 11 మంది చనిపోయిన నేపథ్యంలో IPL మ్యాచ్‌లను పుణేకు షిఫ్ట్ చేసేందుకు RCB <<18265735>>ప్రయత్నిస్తోంది.<<>>