News February 10, 2025
అనకాపల్లి: శారదా నదిలో పడి వ్యక్తి మృతి

అనకాపల్లి వద్ద శారదా నది వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి ఓ వ్యక్తి మృతి చెందాడు. నదిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. మృతుడు విజయనగరానికి చెందిన షేక్ ఇస్మాయిల్ (60) గా గుర్తించారు. పట్టణంలో శారదానగర్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి ఈ నెల 5వ తేదీన వచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 7, 2026
తిరుపతి: విద్యార్థులకు గమనిక.. రూ.15 వేల ప్రైజ్‌మనీ

5-10వ తరగతి విద్యార్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్‌కు దరఖాస్తులు కోరుతున్నట్లు సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ తెలిపారు. విద్యార్థులు మార్చి 10లోపు జిల్లా విద్యాశాఖకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ మూడు ప్రాజెక్టులకు రూ.15వేల నగదు బహుమతి అందజేస్తారు. జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్ ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు.
News February 7, 2026
వాకింగ్‌కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

✦ జిమ్/లాంగ్ వాక్‌కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్‌స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్‌కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్‌సైజ్ చేసినట్టే.
News February 7, 2026
NZB: ముఖ్యమంత్రి పర్యటనతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో జోష్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థుల్లో జోష్ నింపింది. సభకు ముందు CM పోటీ పడుతున్న అభ్యర్థులతో చిట్ చాట్ చేస్తూ అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని గెలుస్తారని పేర్కొనడంతో వారికి గెలుపుపై ధీమా ఏర్పడింది. దాంతో మరింత ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.


