News February 18, 2025

అనకాపల్లి: సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి

image

గంజాయి అక్రమ రవాణా వినియోగం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్ మహిళలు బాలల హక్కులు, రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నరాలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్లో అవగాహన కల్పించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. మంగళవారం అనకాపల్లిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా యువతను సరైన దిశలో నడిపించాలన్నారు.ఈ సమావేశంలో ఎస్.బీ డి.ఎస్.పి అప్పారావు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

మెదక్‌లో తీవ్ర విషాదం.. పెళ్లి కొడుకు మృతి

image

చిన్నశంకరంపేట మండలంలోని అంబాజిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జంగరాయి గ్రామానికి చెందిన పడాల వరప్రసాద్ (30) మృతి చెందాడు. ఈ నెల 23న పెళ్లి ఉండడంతో బంధువులకుఆదివారం పెళ్లి పత్రికలు పంచేందుకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 23న పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News April 20, 2026

ADB: నేటి నుంచి వారోత్సవాలు.. కలెక్టర్ ALERT

image

ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను ఈనెల 20 నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఈ సంక్షేమ వారోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళికబద్దంగా నిర్వహిస్తూ, నివేదికలను నమోదు చేయాలన్నారు.

News April 20, 2026

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు మేడిగడ్డకు రానున్నారు. మధ్యాహ్నం 3గం.కు హెలికాపట్టర్‌లో కాళేశ్వరం చేరుకొని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 3:45కు మేడిగడ్డకు చేరుకొని 4:30 వరకు బ్యారేజీని పరిశీలిస్తారు. 4:35 నుంచి 5:35 వరకు రివ్యూ మీటింగ్ అనంతరం 6:30కు నస్తూర్‌పల్లికి చేరుకుని, అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. 7:45కు తిరుగు ప్రయాణం కానున్నారు.