News August 21, 2025
అనకాపల్లి: స్త్రీ శక్తి పథకంతో రెట్టింపైన ఆక్యుపెన్సీ

స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి కె.ప్రవీణ బుధవారం తెలిపారు. ఈ పథకాన్ని జిల్లాలో మహిళలు సద్వినియోగం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పాయకరావుపేట, చోడవరం, మాడుగుల రూట్లలో గతంలో 40 శాతం ఉన్న మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ 80 శాతానికి పెరిగిందని అన్నారు. స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.
Similar News
News January 23, 2026
కాజీపేట వరకే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు

భద్రాచలం రోడ్-బల్లార్షా మధ్య నడిచే 17033/17034 సింగరేణి ఎక్స్‌ప్రెస్ మెమో రైలు ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పూర్తి స్థాయిలో కాకుండా, కాజీపేట వరకు నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు.మందమర్రిలో 3వ లైన్ పనులు, ట్రాక్ మరమ్మతు నేపథ్యంలో ఈ మార్పు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ రైళ్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత రైలు యధావిధిగా నడవనుందన్నారు.
News January 23, 2026
పొదిలిలో దూర విద్యా పరీక్షా కేంద్రం రద్దు: కో ఆర్డినేటర్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో పొదిలిలోని దూరవిద్య పరీక్షా కేంద్రాన్ని రద్దు చేసినట్లు పరీక్షల సమన్వయకర్త దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. పరీక్ష కేంద్ర నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు వర్సిటీ అబ్జర్వర్స్, ప్రత్యేక తనిఖీ బృందం, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా కేంద్రాన్ని తక్షణమే రద్దు చేసినట్లు తెలిపారు.
News January 23, 2026
తిరుపతి: వెల్లువెత్తిన అర్జీలు

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొని బాధితుల నుంచి సుమారు 500కు పైగా అర్జీలను స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీల వినతులపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూ వివాదాలు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.


