News September 10, 2025

అనీమియా పట్ల అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని, దానిని పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారంతో పాటు ఐసీడీఎస్, డీఆర్డీఏ ద్వారా అనేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు 21 రకాలు కలిగిన అదనపు కిట్లను ఐసిడిఎస్ ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు.

Similar News

News December 13, 2025

రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News December 13, 2025

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>స్పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా 11 చీఫ్ కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా లేదా ఒలింపిక్స్ /పారాలింపిక్స్/ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News December 13, 2025

సైబర్‌ నేరగాళ్లపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదం

image

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్‌ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.