News April 26, 2024
అనుజ్ఞను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతోపాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశార. ఈ సందర్భంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు. MPCలో 1000 మార్కులకు గాను 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News April 19, 2026
HYDలో భారీ డిమాండ్..!

గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు సృష్టించింది. 2 రోజులుగా అత్యధికంగా 99- 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా మేలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడంతో మార్చి నుంచే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది. ఇదే సమయంలో ఆర్టిజన్లు సమ్మెకు దిగడంతో నిత్యం కరెంట్ కట్‌లతో నగరవాసులకు ఇబ్బందులు తప్పడంలేనట్లు తెలుస్తోంది.
News April 19, 2026
TEDxHyderabad: ఆలోచనలకి పదును పెడదాం రండి!

నేడు గండిపేటలోని అక్షయ కన్వెన్షన్‌లో ‘FIRE-UP’ థీమ్‌తో TEDxHyderabad 2026 జరగనుంది. కేవలం మాటలే కాదు మార్పు దిశగా అడుగులు వేయడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. స్పర్శ్ హాస్పిస్ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ‘ఛోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. 9AM నుంచి 5PM వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్య, ఆరోగ్యం, టెక్నాలజీపై చర్చలు సాగుతాయి.