News February 26, 2025
అనుమతి లేనిదే అడవుల్లో సంచరించకండి: కలెక్టర్

శివరాత్రి వేళ అన్నమయ్య కలెక్టర్ చామకూరి శ్రీధర్ చామకూరి కీలక వ్యాఖ్యలు చేశారు. తలకోన, గుండ్లకోన తదితర శివాలయాలు కలిగిన అటవీ ప్రాంతంలో భక్తులు సంచరించకూడదని తెలిపారు. గుండ్లకోన అటవీ ప్రాంతంలో ప్రతిమలు తీసుకెళ్లేందుకు పోలీసు, ఆటవిశాఖ అధికారులు నలుగురు భక్తులకే అనుమతి ఇచ్చారన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులపై ఏనుగుల దాడి అనంతరం అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 17, 2025
ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్

సీనియర్ నటి విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో కలిసి నటించడం వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఎందుకు దూరమయ్యారు? తిరిగి ఎలా కలిశారు? అనేదే కీలకమన్నారు. విజయశాంతి ఈ చిత్రానికి ప్రధాన బలమని, పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారని కొనియాడారు. రేపు ఉ.10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.
News March 17, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: విజయవంతంగా కొనసాగిన సీఎం పర్యటన > దేవరుప్పుల: తాడి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి > జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే మృతి > సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు > సీఎం పర్యటన పలువురు నేతల ముందస్తు అరెస్ట్ > తూతూ మంత్రంగానే సీఎం పర్యటన ఉంది: తాటికొండ రాజయ్య > అక్రమ అరెస్టులను ఖండించిన సిపిఎం నేతలు > జిల్లా అధికారులను అభినందించిన కలెక్టర్
News March 17, 2025
రేగొండ: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన చావడి లక్ష్మి నరసయ్య(50) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నరసయ్య.. కుటుంబ ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు గొడవ పడినట్లు చెప్పారు. కాగా మనస్తాపం చెందిన నరసయ్య ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.