News September 12, 2025
అన్నం పెట్టే రైతన్నకు కష్టకాలంలో తోడుగా ఉందాం: SP

నర్సింహుల పేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రాన్ని ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ సందర్శించారు. రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని అధికారులను కోరారు. నిరసన తెలుపుతున్న హామలీలని ఆప్యాయంగా పలకరించి అన్నం పెట్టే రైతన్నకు మనందరం కష్టకాలంలో తోడుగా ఉండాలని సూచించారు. అధికారులు ఎవరైనా మీ పట్ల అమర్యాదగా మాట్లాడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
Similar News
News December 13, 2025
IIMC 51పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<
News December 13, 2025
ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.
News December 13, 2025
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. కామేపల్లిలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సామగ్రి పంపిణీ, ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, MRO సుధాకర్ పాల్గొన్నారు.


